BJP Chief Madhav : విజయవాడ – దేశం గర్వించదగిన మానవుడు పింగళి వెంకయ్య అన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. ఆగస్టు 2 భారత జాతీయ పతాకం సృష్టికర్త పింగయ్య వెంకయ్య చౌదరి జయంతి. ఈ సందర్బంగా పార్టీ ఆఫీసులో మాధవ్ (BJP Chief Madhav) ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ వ్యాప్తంగా చేసుకోవాల్సిన పండుగ పింగళి వెంకయ్య జయంతి అన్నారు. పింగళి వెంకయ్య జెండా ఆవిష్కరించడం భగవంతుని ఇచ్ఛ అని పేర్కొన్నారు. 19 సంవత్సరాల వయస్సులో బోరా యుద్ధంలో పాల్గొన్నారని చెప్పారు.
AP BJP Chief Madhav Key Comments
మచిలీపట్నం లో పింగళి వెంకయ్య అధ్యాపకుడిగా పని చేశారని గుర్తు చేశారు పీవీఎన్ మాధవ్. యూనియన్ జాక్ కథ పింగళి వెంకయ్యను కదిలించిందని చెప్పారు. నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం పింగళి వెంకయ్య రచించారని తెలిపారు. 1921లో విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని మహాత్మాగాంధీ కి పింగళి వెంకయ్య బహూకరించారని అన్నారు. కంబోడియా నుంచీ మేలి రకం పత్తి తీసుకొచ్చి పత్తి వెంకన్న గా పిలవబడ్డారని ప్రశంసలు కురిపించారు. చిట్టినగర్ లో తనకు కేటాయించిన స్ధలంలోనే జీవించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం, బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, నాయకులు పియూష్ దేశాయ్ పుల్లర్ కాట్ దిలీప్, మువ్వల సుబ్బయ్య, కోలపల్లి గణేష్, పిట్టల గోవిందు, నున్న కృష్ణ, అవ్వారు, బాష, బుల్లబ్బాయి, కాకాని తరుణ్, పచ్చి పులుసు ప్రసాద్, సురేష్ , ప్రవీన్ రాంక , తదితరులు పాల్గొన్నారు.
Also Read : P&G CEO Shailesh Jejurikar Inspiring : ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ సీఈఓగా శైలేష్ జెజురికర్
















