Anushka Shetty : ప్రముఖ నటి, లవ్లీ బ్యూటీ అనుష్క శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డార్లింగ్ ప్రభాస్ తో కొంత కాలం ప్రేమాయణం కూడా నడిపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి క్రేజ్ ఉంది. వీరు త్వరలో కూడా పెళ్లి చేసుకుంటారని కూడా పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఎందుకనో దీనిపై స్పందించ లేదు ప్రభాస్. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది అనుష్క శెట్టి (Anushka Shetty) నుంచి. ప్రభాస్ తో ఎందుకు నటించడం లేదన్న దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనతో నటించాలంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కోరుకుంటున్నారని, కానీ మంచి , దమ్మున్న కథ ఇంకా తన వద్దకు రాలేదని చెప్పింది. ఆయనతో నటించాలని ఎవరికి ఉండదు కోరిక అంటూ పేర్కొంది ఈ ముద్దుగుమ్మ.
Anushka Shetty Key Comments
అనుష్క, ప్రభాస్ కలిసి గతంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చిలో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన, ఇండియన్ సినిమాను షేక్ చేసిన బాహుబలి -1 , బాహుబలి-2 లో ముఖ్య పాత్ర పోషించింది. దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిసింది ఈ మూవీ. సినీ చరిత్రలో ఇదో మైలు రాయిగా నిలిచింది. రికార్డు మోత మోగించింది. ఇదిలా ఉండగా తాజాగా అనుష్క శెట్టి నటించిన చిత్రం ఘాటి. ఈ మూవీతో గ్రాండ్ గా రీ బ్యాక్ చేసేందుకు సిద్దంగా ఉంది. కాగా అనుష్క, ప్రభాస్ చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన , విజయవంతమైన ఆన్-స్క్రీన్ జోడీలలో ఒకరిగా పరిగణించ బడుతున్నారు. మొత్తంగా కథ ఓకే అయితే ఈ ఇద్దరి కాంబోలో మూవీ రాబోతోందన్నమాట.
Also Read : JD Lakshmi Narayana Shocking Comments : ఉద్యోగులపై విచారించే పవర్ సీబీఐకి ఉండదు
