పేద‌ల ఆక‌లిని తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బండారు శ్రావ‌ణి శ్రీ

hellotelugu-BandaruSravaniSree

అనంత‌పురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బుక్క రాయ సముద్రం మండల కేంద్రంలో త్వరలో ప్రారంభించే అన్నా క్యాంటీన్ ను ఈరోజు అనంతపురం జిల్లా టిడిపి అధ్యక్షులు పూల నాగరాజు , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, ADCC బ్యాంక్ చైర్మన్ ముంటి మడుగు కేశవరెడ్డి , టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడుతో కలిసి సందర్శించారు .పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లో అసంపూర్తిగా ఏమైనా నిర్మాణ పనులు ఉన్నాయా? అన్ని సదుపాయాల ఏర్పాటు జరిగిందా అని ఆరా తీశారు. నియోజకవర్గ పరిధిలోని మొదటి అన్నా క్యాంటీన్ ను త్వరలో ప్రారంభించనున్నామని ప్ర‌క‌టించారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌.

గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను రద్దు చేసి, పేదల కడుపు ఆకలితో అలమటించే లాగా సైకో పాలన చేసిందని సంచ‌ల‌న ఆరోఫ‌ణ‌లు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అన్నా క్యాంటిన్ లను పునః ప్రారంభించింద‌ని చెప్పారు. పేదలకు మూడు పూట‌లా కడుపు నిండా ఆహారం అందిస్తోందని తెలిపారు. త్వరలోనే శింగనమల నియోజకవర్గం లో అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి కష్టాలను తీరుస్తామని ప్ర‌క‌టించారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పేద‌లు, నిరుద్యోగులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Exit mobile version