ముంబై : బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు షారుక్ ఖాన్. తను తాజాగా కింగ్ మూవీలో కీ రోల్ పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల తాను ఈ కింగ్ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు . అందరినీ విస్తు పోయేలా చేశాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రం నుండి తప్పుకున్నారు. ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అవసరమైన ‘థీమ్ ట్రాక్’ను మాత్రం ఆయన ఇప్పటికే సిద్ధం చేశారు. అనిరుధ్ రవిచందర్ , ‘కింగ్’ చిత్ర బృందం చర్చల అనంతరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనిరుధ్ చేతిలో ఇప్పటికే పలు దక్షిణాది ప్రాజెక్టులు ఉండటం వల్ల షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రానికి తగినంత సమయం కేటాయించడం కష్టతరంగా మారడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
అనిరుధ్ తప్పుకోవడంతో ఇప్పుడు ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం అందించే బాధ్యతను సచిన్-జిగర్ ద్వయం చేపట్టింది. వీరు అనిరుధ్ రూపొందించిన థీమ్ ట్రాక్‌ను కూడా తిరిగి సర్దుబాటు చేసి, చిత్రంలోని నేపథ్య సంగీతంలో భాగం చేయనున్నారు. తద్వారా ఈ ప్రాజెక్టులో అనిరుధ్ అందించిన సంగీత సహకారం కొనసాగేలా చూస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’, 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రాలలో ఒకటి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుఖ్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొణె, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘కింగ్’ చిత్రం నుండి అనిరుధ్ రవిచందర్ తప్పుకోవడం అనేది ఈ సినిమా సంగీత ప్రయాణంలో ఒక ఊహించని మార్పు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, థీమ్ ట్రాక్ రూపంలో ఆయన అందించిన సహకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ఆయనకున్న అనుబంధం ఏదో ఒక రూపంలో కొనసాగుతుందని సూచిస్తోంది. ఇప్పుడు సంగీతం , నేపథ్య సంగీత బాధ్యతలను సచిన్-జిగర్ చేపట్టడంతో ఈ చిత్రంలోని సంగీతం ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


















