విద్యార్తుల కంటి పరీక్షల్లో ఏపీ స్పూర్తి

మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్

hellotelugu-SatyaKumarYadav

గుంటూరు జిల్లా : విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్లను మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తో క‌లిసి పంపిణీ చేశారు. ఇతర జిల్లాలోని విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద కిందటేడాది నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించి రాష్ట్రంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్షలు జరిపి 94,689 మందికి కంటిచూపులో ఉన్న లోపాల కారణంగా కళ్లజోళ్లు అవసరమని తేలింది.

పారా మెడికల్ ఆఫాల్మిక్ ఆఫీసర్స్, పారా మెడికల్ ఆఫాల్మిక్ అసిస్టెంట్సు ద్వారా పరీక్షలు జరిగాయి. 6/12 కంటే తక్కువ కంటి చూపు ఉన్న వారిలో 90,000 మందికి కంటి అద్దాలను ఇవ్వాలని కేంద్రం రాష్ట్రానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అదనంగా ఆరు శాతం విద్యార్థులకు కంటి అద్దాలు వైద్య ఆరోగ్యశాఖ అందజేస్తుంది. పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2024-25లో లక్ష్యం 90వేల మందికి కంటి అద్దాలు ఇవ్వాలన్న లక్ష్యం ఉన్నా 1,89,102 మందికి ఇచ్చారు. 2025-26లో ఇప్పటికే 94,689 మందికి కంటి అద్దాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. లక్ష్యానికి మించి విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ ఇవ్వడానికి సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవ కారణంగా సేవా సంసల నుంచి స్పందన బాగా కనిపిస్తోంది. వార్షిక లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (జాతీయ అంధత్వ నివారణ సంస్ర) కొనియాడింది .

Exit mobile version