Anchor Lobo : హైదరాబాద్ – ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లోబోకు కోలుకోలేని షాక్ తగిలింది. తన అసలు పేరు
మొహమ్మద్ ఖయ్యూం. తన విలక్షణమైన డ్రెస్సింగ్ స్టైల్ తో జనాదరణ పొందాడు. యాంకర్ గా, యూట్యూబర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన పేరును లోబోగా (Anchor Lobo) మార్చుకున్నాడు. తెలుగు టీవీ ఛానెల్ లో ఒక మ్యూజిక్ షోను హోస్ట్ చేశాడు. ఇది తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఆ తర్వాత నటుడిగా మారాడు. తెలుగు చలన ఇత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే ఏకంగా 100కి పైగా మూవీస్ లో వివిధ పాత్రలలో నటించాడు.
Anchor Lobo Shocking
ఆ తర్వాత ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో ఎంపికయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సమయంలో ఆయన ప్రేక్షకుల అభిమానం పొందారు. ఎనిమిదేళ్ల నాటి రోడ్డు ప్రమాదం కేసులో ఆయనకు ఇప్పుడు ఏడాది జైలు శిక్ష పడింది. ఇద్దరు వ్యక్తుల మరణానికి, ఒక వ్యక్తికి గాయాలైనందుకు జనగామ జిల్లా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆయనపై అభియోగం మోపబడింది.
2018లో, లోబో , అతని బృందం ఒక టీవీ ఛానెల్ కోసం వీడియో చిత్రీకరించడానికి వరంగల్‌కు వెళ్లారు. వారు తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా రఘునాథ్ పల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను లోబో వాహనం ఢీకొట్టింది. ఆ కారును లోబో నడుపుతున్నాడు. భోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాడు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా అతను చదువు మానేయాల్సి రావడంతో అతను తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.
Also Read : Supreme Court New Judges Interesting : కొలువు తీరిన కొత్త న్యాయమూర్తులు

















