Anand Mahindra : భారత్‌పై అదనపు సుంకాలు, జరిమానాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు చేసే పారిశ్రామిక రంగాలు ఈ నిర్ణయంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిణామాలను భారత్ తన ప్రయోజనాలకు అనువుగా మలచుకోవచ్చని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో వ్యాఖ్యలు చేస్తూ, ‘‘1991లో విదేశీ మారక నిల్వల సంక్షోభం లిబరలైజేషన్‌కు దారి తీసినట్లే, ఇప్పుడు కూడా ఈ టారిఫ్ సంక్షోభాన్ని భారత్‌కు అవకాశంగా మార్చుకోవాలి’’ అని అన్నారు.
Anand Mahindra – వ్యాపార వాతావరణంలో మార్పులు అవసరం
భారతదేశం ప్రపంచ పెట్టుబడులకు కేంద్రబిందువుగా మారాలంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని మరింతగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులకు ఒకే విండో ద్వారా అనుమతులు, క్లియరెన్స్‌లు కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
తయారీ రంగానికి ప్రోత్సాహం – ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి ముఖ్యం
దేశీయ తయారీ రంగాన్ని గ్లోబల్ స్థాయిలో పోటీ చేయగలిగేలా తీర్చిదిద్దాలంటే, దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దేశ ఉత్పత్తులకు పోటీతత్వం పెరగాలంటే ఇది కీలకం అని పేర్కొన్నారు. అదే సమయంలో ఎంఎస్‌ఎంఈలు వృద్ధి చెందేందుకు రుణాల సౌలభ్యం పెరగాలన్నారు.
పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలి
విదేశీ మారక నిల్వలను పెంచుకోవాలంటే పర్యాటక రంగ అభివృద్ధి కీలకం అని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు, దేశానికి డాలర్లు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వీసా ప్రక్రియను వేగవంతం చేయడం, పర్యాటక కారిడార్ల అభివృద్ధి వంటి చర్యలు అవసరమని అన్నారు.
Also Read : RBI Repo Rate sensational : వడ్డీ రేట్లపై కీలక అప్డేట్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంకు గవర్నర్


















