బిగ్ బాస్ -9 ఫైన‌లిస్టుల్లో ముగ్గురు

అంద‌రి క‌ళ్లు త‌నూజ పైనే ఫోక‌స్

hellotelugu-BigBoss9Finalists

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ రియాల్టీ షో బిగ్ బాస్ -9 సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఈనెల 21న చివ‌రి విజేత ఎవ‌రో తేలి పోనుంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్స్ మెల మెల్ల‌గా జారుకున్నారు. కేవ‌లం ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు ముగ్గురు ఫైన‌లిస్టులో మిగిలారు. ఓటింగ్ ద్వారా ఎవ‌రిని ఎన్నుకుంటారు. ఎవ‌రిని ఫైన‌ల్ లో నిల‌బెడ‌తార‌నే దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఈసారి కూడా హోస్ట్ గా అక్కినేని నాగార్జున నిర్వ‌హించారు. ఆయ‌న‌ను త‌ప్పిస్తార‌ని మొద‌ట్లో సీజ‌న్ 9 ప్రారంభం కాక ముందు ప్ర‌చారం జ‌రిగింది. కానీ వాటికి చెక్ పెడుతూ నిర్వాహ‌కులు మ‌న్మ‌ధుడినే ఫైన‌ల్ చేశారు. చివ‌రి వ‌ర‌కు త‌నే ఉంటాడ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌య‌సు పెరుగుతున్నా త‌న‌లో ఇంకా స్పార్క్ త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు నాగ్.

ప్రస్తుతానికి ముగ్గురు ఫైన‌లిస్టులు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. వారిలో క‌ళ్యాణ్ , ఇమ్మాన్యూయేల్, త‌నూజ‌. ఇందుకు సంబంధించి బిగ్ బాస్ -9 ప్రోమో కూడా రావ‌డంతో ఇందుకు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. ఇక‌ గ్రాండ్ ఫినాలేకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, పోటీ టాప్ ఐదుగురు ఫైనలిస్టులకు కుదించబడింది . వీరిలో మొద‌ట‌గా ఐదుగురిని సెలెక్టు చేశారు. వారిలో త‌నూజ‌, క‌ళ్యాణ్ ప‌ద్దుల‌, ఇమ్మాన్యూయేల్, సంజ‌న‌, డెమోన్ ప‌వ‌న్ ఉన్నారు. తాజాగా కొన‌సాగుతున్న ఓటింగ్ స‌ర‌ళిని చూస్తే వీరిలో ప‌వ‌న్ , సంజ‌న ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ముగ్గురే మిగిలారు. చివ‌ర‌కు వినోద రంగంలో మాత్రం త‌నూజ ఫైన‌ల్ లో విన్న‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Exit mobile version