Minister Amit Shah Interesting : దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు

స్ప‌ష్టం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

Hello Telugu - Amit Shah Interesting

Hello Telugu - Amit Shah Interesting

Amit Shah : ఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామ‌ని చెప్పారు. ఆదివారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్ప‌ష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి.

Home Minister Amit Shah Comments

డీ లిమిటేషన్ కమిషన్ చట్టం కాలేదని పేర్కొన్నారు అమిత్ షా (Amit Shah). ఇంకా చ‌ట్టం కాకుండానే రాజ‌కీయ పార్టీలు అన‌వస‌రంగా రాద్దాంతం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. వాటిపై ఎక్కువగా ఫోక‌స్ పెట్టామ‌న్నారు. అందుకే కొందరు విమర్శలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని తీసుకొస్తామ‌ని చెప్పారు అమిత్ షా.

పార్లమెంట్‍లో డీలిమిటేషన్‍పై చర్చిస్తామ‌ని పేర్కొన్నారు. పూర్తి స్థాయి చర్చ తర్వాతే చట్టం తెస్తామ‌ని అన్నారు. ఇందుకు సంబంధించి పున‌ర్విభ‌జ‌న క‌మిష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు అమిత్ చంద్ర షా. అన్ని రాష్ట్రాలు కేంద్ర స‌ర్కార్ కు ఒక్క‌టేన‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. కొన్ని రాజ‌కీయ పార్టీలు, నేత‌లు కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. చ‌ట్టం కాకుండానే, ఆధారాలు లేకుండానే ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు అమిత్ షా. డీ లిమిటేష‌న్ పై జ‌రిగే చ‌ర్చ‌లో అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ప్రాతినిధ్యం క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి.

Also Read : CM Chandrababu Interesting Visit : 15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Exit mobile version