Amit Shah : ఢిల్లీ : కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గీత దాటితే గనుక మరోసారి ఆపరేషన్ సిందూర్ ప్రయోగించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని, కానీ ఇక నుంచి ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ లో
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మంగళవారం అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక ‘బ్లాక్ క్యాట్’ కమాండో దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) 41వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఇక్కడ తన ప్రధాన కార్యాలయంలో ఉద్దేశించి ప్రసంగించారు అమిత్ చంద్ర షా.
Amit Shah Strong Warning to Pakistan
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత, మే నెలలో ఆపరేషన్ సిందూర్ కింద భారత రక్షణ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ,రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. అయినా దాయాది పాకిస్తాన్ కు బుద్ది రాలేదన్నారు అమిత్ షా. NSG అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సమాఖ్య కంటింజెన్సీ దళం. ఇది 1984లో స్థాపించబడింది. దాని ‘బ్లాక్ క్యాట్’ కమాండోలు అధిక ప్రమాదం ఉన్న వీఐపీలను రక్షించడంతో పాటు నిర్దిష్ట ఉగ్రవాద నిరోధక, హైజాక్ నిరోధక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం దేశంలో ఐదు కేంద్రాలలో ఇవి ఏర్పాటై ఉన్నాయి. వాటిలో ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ , గాంధీనగర్ నగరాలలో కొలువు తీరాయి.
Also Read : Minister Veena George Shocking Comments : 2031 నాటికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ


















