అమెరికా : అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డేనియల్ నరోడిట్స్కీ 29 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మృతితో తీవ్ర విషాదం అలుముకుంది చెస్ క్రీడా ప్రపంచంలో. ఇదిలా ఉండగా నరోడిట్స్కీ 18 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌తో పాటు చెస్‌లో అత్యున్నత టైటిల్ అయిన గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు . చైల్డ్ ప్రాడిజీగా ప్రారంభించి క్రీడలో అత్యంత ప్రభావ వంతమైన అమెరికన్ స్వరాలలో ఒకరిగా మారాడు. చెస్ గ్రాండ్‌మాస్టర్ డేనియల్ నరోడిట్స్కీ మృతి చెందడం పట్ల తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. నరోడిట్స్కీ నార్త్ కరోలినా లోని షార్లెట్ చెస్ సెంటర్ లో గత కొన్నేళ్లుగా శిక్షణ పొందాడు. తను మృతి చెందిన విషయాన్ని సదరు అకాడెమీ కీలక ప్రకటన చేసింది.
చెస్ ఆట పట్ల ఆయనకు ఉన్న మక్కువ, ప్రేమ కోసం ఆయన ప్రతిరోజూ మనందరికీ తెచ్చిన ఆనందం ప్రేరణ కోసం డేనియల్‌ను గుర్తుంచుకుందామని పేర్కొంది. అయితే తను మృతి చెందడానికి గల కారణాలు ఏవి అనే విషయంపై ఇంకా వివరాలు వెల్లడించ లేదు. తను తక్కువ కాలంలో కాలం చేయడం పట్ల చెస్ క్రీడా రంగానికి చెందిన పలువురు మాజీ క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తను అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టాడు. అండర్ 12 ప్రపంచ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్ లోను అధిరోహించాడు. తను సాంప్రదాయ చెస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా టాప్ 200లో స్థిరంగా ర్యాంక్ పొందాడు.



















