America : అమెరికా – డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా కొలువు తీరాక భారత్ పై సుంకాలను వేస్తూ వస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. రష్యాపై ఒత్తిడి తీసుకు రావడానికి భారతదేశం సుంకాలను ట్రంప్ రెట్టింపు చేశారని స్పష్టం చేశారు. ట్రంప్ గతంలో ప్రకటించిన 25 శాతంపై అదనంగా 25 శాతం లెవీ విధించడం ద్వారా భారతదేశ సుంకాన్ని 50 శాతానికి రెట్టింపు చేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్ వివాదాన్ని కొనసాగించకుండా రష్యాను నిరోధించడానికి అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను విధించారని కరోలిన్ లీవిట్ చెప్పుకు వచ్చారు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్దాన్ని ఆపేందుకు ట్రంప్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని తెలిపారు.
America Shocking to India
ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్దాన్ని కూడా ఆపిన ఘనత తమ దేశాధ్యక్షుడు ట్రంప్ కు దక్కుతుందన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ , ఇరాన్ ల వార్ ను కూడా ఆపేశారన్నారు. ఇదే సమయంలో ఇండియాపై కూడా ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు. ఏదైనా సమావేశం జరగడానికి మరో నెల ముందు వేచి ఉండాలనే ఇతరుల ఆలోచనలను ఆయన ఎగతాళి చేశారని పేర్కొన్నారు. ట్రంప్ వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారని తెలిపారు. మరో వైపు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారని ఈ సందర్బంగా వెల్లడించారు. అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నం పట్ల ధన్యవాదాలు తెలిపారు. దీనిని కూడా ప్రస్తావించారు లివిట్.
Also Read : PM Modi Gift : మిడిల్ క్లాస్ మనిషికి ప్రధాని మోదీ భారీ దీపావళి కానుక
















