Ambati Rambabu : గుంటూరు జిల్లా – ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పదే పదే పిల్లలను కనమని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తానేమో ఒక్కడినే కన్నాడని, తన తనయుడు లోకేష్ కు కూడా ఒక్కడే కొడుకని మరి మీరెందుకు ఆచరణలో పెట్టలేదంటూ ప్రశ్నించారు. తనకో రూల్ మిగతా వాళ్లకు ఓ రూలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏరోజైనా వాళ్ళ చెల్లెళ్లు రాఖీలు కట్టారా ? అని నిలదీశారు రాంబాబు (Ambati Rambabu). మొన్న అమరావతిలో ఇంటి శంకుస్థాపన చేసినప్పుడు మీ మేనత్తలు వచ్చారా లోకేష్ అంటూ ఫైర్ అయ్యారు. మీ మేనత్తలను పిలిచి కనీసం వాళ్లకు పట్టుచీరలు పెట్టారా? మీ వాళ్లను మీరే సరిగా చూసుకోరు ఇంకా జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Ambati Rambabu Slams CM Chandrababu
పదే పదే తమ నాయకుడిపై తండ్రీ కొడుకులకు నోరు పారేసుకోవడం తప్పా వేరే పని లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో మోసం చేయడం తప్పా చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాచరిక పాలన సాగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు. కడపజిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమంగా గెలిచారని ఆరోపించారు. పూర్తిగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని, ప్రజలను భయభ్రాంతులకు ఉరి చేశారని వాపోయారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు.
Also Read : MLA Komatireddy Fired on CM Revanth : పదవులు తీసుకోండి కానీ పైసలు ఇవ్వండి

















