Ambati Rambabu : అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu). ఆయన మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు భూములు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా రాజధాని పేరుతో వేల ఎకరాలు కొనుగోలుకు శ్రీకారం చుట్టలేదన్నారు. తమ సర్కార్ హయాంలో రాష్ట్రంలోని పలు భూములకు భారీ ధరలు ఉండేవన్నారు. కానీ చంద్రబాబు కొలువు తీరాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు అంబటి రాంబాబు. విచిత్రం ఏమిటంటే అమరావతి కథ అంతులేని కథలా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Ex Minister Ambati Rambabu Shocking Comments on CM Chandrababu
కేవలం అమరావతిని అడ్డు పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు అందినంత మేర దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఇప్పటి వరకు స్వచ్చంధంగా భూములు ఇచ్చేలా భయ భ్రాంతులకు గురి చేశారని వాపోయారు. ఇన్నేళ్లయినా ఇంకా ఎందుకు వారికి నష్ట పరిహారం ఇవ్వడం లేదంటూ నిలదీశారు అంబటి రాంబాబు. అమరావతి రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాల భూములు ఇచ్చారని చెప్పారు. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో అత్యుత్తమ రాజధాని కడతామని ప్రగల్భాలు పలికారని ఇప్పుడు ఎక్కడ కట్టారో , ఏం చేశారో, ఎవరికి అప్పగించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Popular Actor Subhalekha Sudhakar Invites : 15న ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ















