Amazon : అమెరికా : ప్రపంచంలోనే నెంబర్ వన్ లాజిస్టిక్ కంపెనీగా పేరు పొందిన అమెజాన్ (Amazon) సంస్థ ఉన్నట్టుండి బాంబు పేల్చింది. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ ప్రభావం చూపుతున్న తరుణంలో ఉన్నట్టుండి తమ సంస్థలో పని చేస్తున్న వారిపై వేటు వేయాలని నిర్ణయించింది. ఈమేరకు 30 వేల మందికి పైగా ఇంటి బాట పట్టేలా చూస్తోంది. ఇ-కామర్స్ , టెక్ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెరిగిన పెట్టుబడుల మధ్య ఖర్చులను తగ్గించడంతో అమెజాన్ ఉద్యోగులను తొలగించనుందని అమెరికాలోని టాప్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం సదరు సంస్థలో 3,50,000 మంది వివిధ విభాగాలలో పని చేస్తున్నారు. వీరిలో కనీసం 10 శాతం కోత పెట్టాలని అమెజాన్ చీఫ్ నిర్ణయానికి వచ్చేశారు. అంటే దాదాపు 30 వేలకు పైగా ఉద్యోగులు తమ జాబ్స్ ను కోల్పోతున్నారన్న మాట.
Amazon Huge Layoffs
వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ తదితర మీడియా సంస్థలు అమెజాన్ ఉద్యోగుల తొలగింపు నిజమేనని పేర్కొన్నాయి. ఈ వార్త పెద్ద ఎత్తున కలకలం రేపింది సదరు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులలో. ఇప్పటికే అమెరికాలో కొలువు తీరిన ట్రంప్ నిర్వాకం కారణంగా పెద్ద ఎత్తున జాబ్స్ కోల్పోతున్నారు. పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరో వైపు టారిఫ్ ల విధింపు వల్ల ఆయా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఇదంతా అమెరికా దేశం కోసమేనని పదే పదే చెబుతూ వస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు. ఈ తరుణంలో ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, తదితర కంపెనీలు కూడా ఇప్పటికే ఉద్యోగులను తీసి వేసే పనిలో ఉన్నాయి. ఇటీవలే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది టీసీఎస్ కంపెనీ.
Also Read : BRS Party Gets Huge Donations : బీఆర్ఎస్ పార్టీకి రూ. 15 కోట్లు విరాళం



















