అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అమరావతిని క్వాంటం హబ్ గా మారుస్తామన్నారు. త్వరలోనే దేవంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. దేశంలో మోదీ ప్రధానమంత్రి అయ్యాక సీన్ మారిందన్నారు. అన్ని రంగాలలో ఇండియా దూసుకు పోతోందన్నారు. తను పాలనా పగ్గాలు చేపట్టాక 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానికి వచ్చిందన్నారు. ఇదంతా ప్రధానమంత్రి తీసుకున్న చొరవ, నాయకత్వం కారణంగా అయ్యిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. త్వరలోనే 3వ స్థానానికి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి మన దేశం ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుందని , ఆ నమ్మకం తనకు ఉందన్నారు.
ఆ సత్తా, శక్తి నరేంద్ర మోదీకి ఉందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. తెలుగు వారిని అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ప్రపంచంలో భారతీయలు నెంబర్ 1గా ఉంటారు. భారతీయుల్లో తెలుగువారు నెంబర్ 1గా ఉంటారని అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా చేశారు. ప్రజల కోసం ఆయన బతికారు.. ఆలోచించారు. ఏ పదవిలో ఉన్నా దానికి వన్నె తెస్తారంటూ కొనియాడారు. ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఎప్పుడూ ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో నిలవాలని పని చేస్తున్నారు. ఇటువంటి నాయకులతో పని చేయడం ఆనందంగా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచామని అన్నారు సీఎం. ఇంక గేరు మార్చుతాం. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ భవనాలను వాజ్ పేయి ప్రారంభించారు. హైటెక్ సిటీతో సైబరాబాద్ ప్రారంభమైంది. క్వాంటమ్ వ్యాలీతో అమరావతి ప్రారంభమవుతోందని అన్నారు.















