అమరావతి : యావత్ ప్రపంచం విస్తు పోయేలా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఉండ బోతోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం రాజధాని నిర్మాణం పనులపై ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పనులు ఎంత వరకు వచ్చాయి. నిర్దేశించిన కాల పరిమితిలో చేస్తారా లేదా అని ఆరా తీశారు. నిర్మాణ సంస్థలుగా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు…కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదన్నారు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయని స్పష్టం చేశారు సీఎం.
అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరేని పేర్కొన్నారు. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని అన్నారు.. కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు నాయుడు.. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించు కోవాలని చెప్పారు. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు అని తెలిపారు. కాగా తాము నిర్ధేసించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు . ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని అన్నారు . ఇదే క్రమంలో మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించు కోవాలని పేర్కొన్నారు.

















