AM Green Group : విశాఖపట్నం : ఏపీకి మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ ఏఎం గ్రీన్ గ్రూప్ (AM Green Group) సంస్థ తీపికబురు చెప్పింది. శనివారం వైజాగ్‌లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏఎం గ్రీన్ గ్రూప్ రూ. 54,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. కాకినాడ (ఉప్పాడ)లో రెండు దశల్లో సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి ఏఎం గ్రీన్ రూ. 44,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద RFNBO-కంప్లైంట్ గ్రీన్ అమ్మోనియా సౌకర్యాలలో ఒకటి కూడా ఉంది. అదనంగా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి అంతటా 2G ఇథనాల్ బహుళ బయోరిఫైనరీలు, 180 KTPA సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్‌ను స్థాపించడానికి వారు రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.
AM Green Group Huge Investments in AP
ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ను తదుపరి తరం బయో ఇంధనాల కోసం ప్రపంచ గమ్యస్థానంగా ఉంచే సమగ్ర “ఫామ్ టు ఫ్లైట్” పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్ , తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా విశాఖ సదస్సు వేదికగా ఏపీ సర్కార్ లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యింది.
Also Read : AP Huge Investments : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రూక్‌ఫీల్డ్‌తో ఒప్పందం


















