చలనచిత్ర పరిశ్రమపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

'ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తాజా కవర్ పేజీపై 'పుష్ప రాజ్'గా

hellotelugu-AlluArjun

హైద‌రాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు జాతీయ సరిహద్దులను దాటి ప్రపంచ స్థాయిలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ‘ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తాజా కవర్ పేజీపై ‘పుష్ప రాజ్’గా ఆయన కనిపించడం సినీ వర్గాలను ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఈ ప్రత్యేక ‘షోస్టాపర్స్’ ఎడిషన్‌లో కవర్ స్టార్‌గా నిలిచిన అల్లు అర్జున్ భారతీయ చలనచిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పాన్-ఇండియా స్థాయి నుండి గ్లోబల్ స్టార్‌డమ్ వైపు దూసుకెళ్తూ, టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తున్న అల్లు అర్జున్ బ్రాండ్ విలువ రోజురోజుకూ ఊహించని స్థాయికి పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో రికార్డులు సృష్టిస్తున్న ప్రముఖ నటులు, క్రీడాకారులు, కళాకారులను ఎంపిక చేసి ‘ఫోర్బ్స్ ఇండియా’ సంస్థ ‘షోస్టాపర్స్’ పేరుతో ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఈ అత్యంత ప్రజాదరణ పొందిన మ్యాగజైన్ కవర్ పేజీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం ఆయన జాతీయ స్థాయి గుర్తింపున‌కు నిదర్శనం. ఈ కవర్ స్టోరీ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితులపై అల్లు అర్జున్ చేసిన నిర్భయమైన, స్పష్టమైన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చకు దారితీసేలా చేశాయి.

“బాలీవుడ్ అయినా, దక్షిణాది సినిమా అయినా లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమా అయినా సరే… పరిశ్రమ స్తంభించి పోవడానికి ప్రధాన కారణం కేవలం ‘సగటు స్థాయిస‌ కంటెంట్ మాత్రమే,” అని బన్నీ స్పష్టంగా చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేయ లేదని, అసలు సమస్య నిర్మాతలు అందించే కంటెంట్‌లో బలం లేక పోవడమేనని చెబుతూ సినిమా విజయానికి సంబంధించిన అతిపెద్ద రహస్యాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ట్రెండ్‌లో, సగటు కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఐకాన్ స్టార్ సంచలన వ్యాఖ్య చేశారు. మంచి, వినూత్నమైన కంటెంట్ ఉన్న సినిమాలు ప్రపంచంలో ఎక్కడైనా కచ్చితంగా విజయం సాధిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. కాబట్టి, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడానికి గొప్ప దృశ్య అనుభవాన్ని , బలమైన కంటెంట్‌ను అందించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. కథ ఎంపికే సినీ పరిశ్రమ మనుగడకు ప్రాణాధారం అనే ఆయన విశ్లేషణకు సినీ విశ్లేషకుల నుండి భారీ మద్దతు లభిస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాలతో అల్లు అర్జున్ సృష్టించిన రికార్డులు మామూలు విషయం కాదు. ఈ రెండు సినిమాలు కలిసి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ₹2200 కోట్ల వసూళ్లను సాధించాయి. పుష్ప ఫ్రాంచైజీతో, శక్తివంతమైన కంటెంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో బన్నీ ఆచరణాత్మకంగా నిరూపించి, చూపించారు. ఈ చారిత్రాత్మక విజయాల‌తో అల్లు అర్జున్ ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ బ్యాంకబుల్ స్టార్‌గా అగ్రస్థానంలో నిలిచి, వసూళ్లకు గ్యారెంటీ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో బలమైన కంటెంట్‌తో కూడిన శక్తివంతమైన చిత్రాలతో బన్నీ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’తో పాటు, లోకేష్ కనగరాజ్ చిత్రంతో ఆయన చేతిలో ఉన్నారు. అల్లు అర్జున్ నుండి రాబోయే ఈ చిత్రాలు పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నాయి. ఫోర్బ్స్ కవర్ స్టోరీలో ఆయన ఎంతో ఉత్సాహంతో ఇచ్చిన కథనం తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచ మార్కెట్లో సృష్టించ బోయే ఆ తదుపరి స్థాయి విధ్వంసం ఎలా ఆవిష్కృతమవుతుందో మనం చూడాలి.

Exit mobile version