Allu Arjun : దుబాయ్ – దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా 2025) కార్యక్రమం. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun), ఉత్తమ చిత్రంగా పుష్ప -2 ఎంపికైంది. ఈ అవార్డులకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఇక్కడే అవార్డ్ ఫంక్షన్ కొనసాగింది. తాజాగా 5వ ఎడిషన్ ఆగస్టు 30న దుబాయ్ లోని షార్జా ఎక్స్ పో సెంటర్ పలువురు చలన చిత్ర ప్రముఖల మధ్య అవార్డుల పురస్కారం కొనసాగింది. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు , సీఈఓ సౌరభ్ కేసరి నేతృత్వంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
Allu Arjun Gets Best Actor Award
కాగా ఈ అవార్డ్స్ 2025 జ్యూరీకి ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, ప్రఖ్యాత సంగీత స్వరకర్త కోటి , దర్శకుడు బి. గోపాల్ అధ్యక్షత వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాలలో ఎంపికైన కళాకారులు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అవార్డుల సందర్బంగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ , ఉత్తమ నటిగా మీనాక్షి లక్కీ భాస్కర్ , ఉత్తమ చిత్రంగా పుష్ప 2 , ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ నిర్మాతలుగా అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ , ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ కొరియోగ్రఫీ కింద భాను మాస్కర్ , ఉత్తమ ఎడిటర్ గా నవీన్ సూలి, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును రత్నవేలు అందుకున్నారు.
ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి, ఉతమ గాయకుడిగగా అనురాగ్ కులకర్ణి, ఉత్తమ గాయనిగా మంగ్లీ, సమీరా భరద్వాజ్, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్స్ రజాకర్, ఉత్తమ నటుడు తేజ సజ్జా, ఉత్తమ ప్రదర్శన జ్యూరీ రాజా రవీంద్ర, ఉత్తమ నటుడు కిరణ్ అబ్బరం , ఉత్తమ యువ నటుడు రోసణ్, ఉత్తమ ప్రామిసింగ్ యువ నటి శ్రీదేవి, మానస వారణాసి, ఉత్తమ దర్శకుడు అప్సర్, గద్దర్ స్మారక సంగీత పురస్కారం మాట్ల తిరుపతి, ఉత్తమ సహాయ నటుడు వినయ్ రాయ్, ఉత్తమ సహాయ ప్రదర్శన హర్ష చెముడు, బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ తొలి నటి గా నయన్ సారిక, ఉత్తమ తొలి నటుడు ధర్మ కాకాని, ఉత్తమ తొలి దర్శకుడు యధు వంశీ, తొలి నిర్మాత నిహారిక కొణిదల , గ్లోబల్ కమెడియన్ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారు. జీవిత సాఫల్య పురస్కారం కింద నిర్మాత అశ్విని దత్ , ప్రామిసింగ్ యాక్టర్ సత్యదేవ్, అభిమాన నటి ఊర్వశి రౌతేలా అవార్డులు అందుకున్నారు.
Also Read : Beauty Pooja Hegde : ఆరోగ్యంగా ఉన్నా విశ్రాంతి తీసుకుంటున్నా
