Israel : గాజా – గాజాపై విచక్షణా రహితంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమ ఛానల్ కు చెందిన జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారంటూ ప్రకటించింది ఆల్ జజీరా న్యూస్ ఛానల్ సంస్థ ప్రకటించింది. 22 నెలల యుద్ధంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిందంటూ పేర్కొంది. సంఘర్షణ సమయంలో దాదాపు 200 మంది మీడియా ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేసింది. గాజా నగరంలో జర్నలిస్టులను ఉంచిన టెంట్‌పై ఇజ్రాయెల్ దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ నలుగురు సహచరులతో పాటు మరణించినట్లు ప్రకటించింది.
Israel Attack – AL Jazeera Reporters Dead
ఆదివారం గాజా నగరంలోని తమ టెంట్‌పై ఇజ్రాయెల్ (Israel) దాడిలో ప్రముఖ రిపోర్టర్‌తో సహా తమ ఇద్దరు కరస్పాండెంట్లు , ముగ్గురు కెమెరామెన్‌లు మరణించారని అల్ జజీరా తెలిపింది. హమాస్‌తో అనుబంధంగా ఉన్న “ఉగ్రవాది”గా ముద్రవేసిన రిపోర్టర్ అనాస్ అల్-షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో అంగీకరించింది. గాజాలో 22 నెలల యుద్ధంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి ఇదే .
కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మొహమ్మద్ నౌఫాల్, మోమెన్ అలీవాతో పాటు మొహమ్మద్ ఖ్రీఖేగా ఉన్నారని తెలిపింది ఆల్ జజీరా. కాగా గాజా దాడిని ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు నెతన్యాహు సమర్థించారు . జర్నలిస్టుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నట్లు ఆరోపించారు. అందుకే దాడి చేయడం జరిగిందన్నారు.
గాజా నగరంలో ఐడిఎఫ్ అల్ జజీరా నెట్‌వర్క్‌కు జర్నలిస్ట్‌గా నటిస్తున్న ఉగ్రవాది అనాస్ అల్-షరీఫ్‌ను కాల్చివేసింది అని ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. అనస్ అల్-షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడని ఆరోపించింది. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులను చేపట్టేందుకు కీలక పాత్ర పోషించాడని వెల్లడించింది.
Also Read : Popular Cricketer Syed Kirmani : 1983 వరల్డ్ కప్ లో ఆడటం చిరస్మరణీయం

















