Akkineni Nagarjuna : హైదరాబాద్ : సినిమా పైరసీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). ఐ బొమ్మ, బొప్పం పైరసీ వెబ్ సైట్స్ ద్వారా వందల కోట్ల నష్టం వాటిల్లిందని వాపోయారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెండు వెబ్ సైట్స్ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు, సీపీ సజ్జనార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారని చెప్పారు నాగార్జున. ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయని హెచ్చరించారు. రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము అని పేర్కొన్నారు . వాళ్ళ సంపాదన వేల కోట్లల్లో ఉంటుందన్నారు.
Akkineni Nagarjuna Shocking Comments on IBomma
ఇదిలా ఉండగా ఐబొమ్మ నిర్వాహకుడి నిర్వాకం గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు సీపీ వీసీ సజ్జనార్. ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడని చెప్పారు. ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉందన్నారు. కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్‌సైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని తెలిపారు. 2019లో ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను తెరిచాడని, 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడని వెల్లడించారు. ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తామని ప్రకటించారు.
Also Read : Pawan Kalyan Important Comments on VC Sajjanar : సీపీ సజ్జనార్ కు పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్

















