హైదరాబాద్ : దమ్మున్న డైరెక్టర్ గా గుర్తింపు పొందిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అఖండ -2 తాండవం సీక్వెల్ మూవీ దుమ్ము రేపుతోంది. వసూళ్లలో రికార్డుల మోత మోగిస్తోంది. తొలి రోజు పాజిటివ్ టాక్ తో దూసుకు పోయిన ఈ మూవీ ఏకంగా మూడు రోజుల్లోనే వంద కోట్లకు దగ్గరగా రావడం విశేషం. ఇది సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. నైజాం ఏరియాలో ఇప్పటికే తాము తీసుకున్న డబ్బులన్నీ తిరిగి వచ్చాయని ప్రకటించాడు. సినిమాను నమ్ముకున్న వారంతా ఇప్పుడు ఫుల్ ఖుష్ లో ఉన్నారు. అఖండ -2 చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రధానంగా సనాతన ధర్మంకు మద్దతుగా ఉండడంతో పండుగ చేసుకుంటున్నారు.
ఫ్యాన్స్ కు సంబంధించి మరో ప్రకటన చేశారు మూవీ మేకర్స్. టాకీస్ లలో అఖండ -2 తాండవం చూడలేక పోయినప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో ఎప్పుడు వస్తుందోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాది 2026 జనవరి నెలలో దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రానుందని ప్రకటించారు. విడుదలైన తర్వాత నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 దేశభక్తి, సైన్స్ ఫిక్షన్ , బ్లాక్ మ్యాజిక్ వంటి బహుళ జానర్‌లను మిళితం చేసి ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చి దిద్దడంలో ఫోకస్ పెట్టారు దర్శకుడు బోయపాటి శ్రీను. అంతే కాదు ఈ సినిమాను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చూశారు. ప్రత్యేకంగా బోయపాటిని అభినందించారు.


















