భారీ వ‌సూళ్ల దిశ‌గా ‘ఆకాశంలో ఒక తార’

అద్భుతంగా ఉందంటూ పాజిటివ్ టాక్

hellotelugu-AkashaamloOkaTara

హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ న‌ట‌కు పెట్టింది పేరు మ‌ల‌యాళ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్. త‌ను ఎంచుకునే పాత్ర‌లు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప చేసేలా ఉంటాయి. తాను కీర్తి సురేష్ తో క‌లిసి న‌టించిన తెలుగు చిత్రం మ‌హాన‌టితో తెలుగు వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. వారి గుండెల్లో చిర‌స్థాయిగా స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆకాశంలో ఒక తార‌. ఈ సినిమా న‌వంబ‌ర్ 20వ తేదీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటు సాత్విక వీర‌వ‌ల్లి ఈ సినిమా ద్వారా కొత్త‌గా ప‌రిచ‌యం అయ్యారు.

ప్ర‌త్యేకించి ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అంతేకాకుండా దుల్క‌ర్ స‌ల్మాన్ తో పోటీప‌డి న‌టించింది కొత్త న‌టి సాత్విక వీర‌వ‌ల్లి. త‌న‌కు ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేసింది. ఇందులో ఈ ఇద్ద‌రితో పాటు. త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి శ్రుతి హాస‌న్ కూడా ఓ కీ రోల్ పోషించింది ఆకాశంలో ఒక తార చిత్రంలో. ఈ చిత్రం విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కులతో భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఈ మూవీ బడ్జెట్ అంచనా సుమారు రూ. 60 కోట్లు, డిజిటల్, ఆడియో హక్కులుసుమారు రూ. 42 కోట్లు, థియేట్రికల్ బ్రేక్-ఈవెన్ లక్ష్యం: రూ. 100 కోట్ల గ్రాస్. ఇదిలా ఉండ‌గా భారీ యాక్షన్ చిత్రాల మధ్య భావోద్వేగ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే సానుకూల స్పందనతో బాక్సాఫీస్ పోటీలో నిలిచింది. రాబోయే రోజులలో రూ. 200 కోట్ల దిశ‌గా వెళుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Exit mobile version