సీఎం జోసెఫ్ విజ‌య్ కు అజిత్ థ్యాంక్స్

మోటార్ స్పోర్ట్స్ కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై

hellotelugu-ActorAjith

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు, మోటార్ స్పోర్ట్స్ ను ఇష్ట ప‌డే అజిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ శాస‌న స‌భ వేదికగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం క‌ల్పిస్తామ‌ని, మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు కృషి చేస్తామ‌న్నారు. భారీ ఎత్తున నిధుల‌ను కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా న‌టుడు అజిత్ స్పందించారు. సీఎం విజ‌య్ ఇస్తున్న ప్రోత్సాహం, మ‌ద్ద‌తుపై సూర్ స్టార్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది త‌న‌ను ఎంత‌గానో సంతోషించేలా చేసింద‌న్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రకటించ‌డం, మోటార్‌స్పోర్ట్‌తో సహా అన్ని క్రీడా విభాగాలకు ఎంతో అవసరమైన ప్రాధాన్యతను ఇస్తున్నందుకు తాను ముఖ్య‌మంత్రిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్ట‌న్లు తెలిపారు.

ముందు నుంచీ తాను మోటార్ స్పోర్ట్స్ ను ఇష్ట‌ప‌డుతూ వ‌స్తున్నాన‌ని పేర్కొన్నారు. అటు సినిమాల‌లో ఇటు స్పోర్ట్స్ ప‌రంగా తాను కూడా పాల్గొంటున్నానని, ఈ రంగంలో యువ‌త కూడా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు ఈ సంద‌ర్భంగా న‌టుడు అజిత్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను మోటార్‌స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నందున ప్ర‌ముఖ ప్రపంచ‌ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన ఒక కొటేషన్‌ను నేను పునరుద్ఘాటించాలని అనుకుంటున్నానని అన్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం వేసిన ఒక చిన్న అడుగు, భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్‌కు ఒక పెద్ద ముందడుగు!’ అని పేర్కొన్నారు అజిత్. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ రాబోయే రోజుల్లో అన్ని ప్ర‌య‌త్నాల‌లోనూ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు.

Exit mobile version