Ajay Srivastava : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా సరుకులపై విధించిన తాజా సుంకాల నిర్ణయం భారత్‌కు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుందని మాజీ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ అజయ్ శ్రీవాస్తవ (Ajay Srivastava) అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అమెరికాతో చేసే ఏ ఒప్పందమూ శాశ్వతం కాదని ఈ పరిణామం చూపించిందని, కాబట్టి భారత్ ఆత్మనిర్భరత (self-reliance) పై దృష్టి సారించడంతో పాటు పాశ్చాత్య దేశాలు, బ్రిక్స్ (BRICS) దేశాలతో సమతౌల్యం పాటించాలని సూచించారు.
Ajay Srivastava Key Comments
అక్టోబర్ 10న అధ్యక్షుడు ట్రంప్, నవంబర్ 1, 2025 నుంచి చైనా సరుకులపై 100% సుంకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీతో చైనాపై మొత్తం సుంకం దాదాపు 130%కు పెరుగుతుంది. ఈ చర్య చైనా అక్టోబర్ 9న ప్రకటించిన కొత్త రేర్ ఎర్త్ ఎగుమతి నియంత్రణలకు ప్రతిస్పందనగా తీసుకున్నది.
చైనా ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం, 0.1% కంటే ఎక్కువ చైనా మూలం రేర్ ఎర్త్ కలిగిన ఉత్పత్తులు, లేదా చైనీస్ రిఫైనింగ్ లేదా మాగ్నెట్ టెక్నాలజీతో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే చైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం చైనా ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ రిఫైనింగ్ సామర్థ్యంలో 70% కంటే ఎక్కువ వాటాను నియంత్రిస్తోంది.
అజయ్ శ్రీవాస్తవ వ్యాఖ్యానిస్తూ, “ఈ పరిస్థితి భారత్‌కు స్పష్టమైన సందేశం ఇస్తోంది — బాహ్య వాణిజ్య ఒప్పందాలపై అధిక ఆధారపడడం ప్రమాదకరం. దేశం తన పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలు, సరఫరా గొలుసును బలోపేతం చేయడం ద్వారానే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలదు,” అని పేర్కొన్నారు.
Also Read : Mukesh Ambani Huge Donation : బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల కు 10 కోట్ల విరాళం ప్రకటించిన అంబానీ



















