Sudarshan Reddy : హైదరాబాద్ : ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి తరపున దేశ ఉప రాష్ట్రపతి పదవికి బరిలో నిలిచిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి (Sudarshan Reddy) బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఎన్నిక కీలకం కానుంది. పెద్ద ఎత్తున మోదీ పరివారానికి సవాల్ గా మారనుంది. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జస్టిస్ రెడ్డి పోటీ చేయడం, ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పోటీలో ఉండడం ఒకింత ఉత్కంఠను రేపేలా చేసింది.
AIMIM Supports Justice Sudarshan Reddy
ఇదిలా ఉండగా ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనతో ఫోన్ లో మాట్లాడారని, జస్టిస్ రెడ్డికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారని తెలిపారు. ఇందులో భాగంగానే తాను సపోర్ట్ చేయాలని భావించానని చెప్పారు. ఈ నిర్ణయం తన ఒక్కడిది కాదని తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులందరి ఏకాభిప్రాయం కారణంగా తీసుకున్నట్లు తెలిపారు ఓవైసీ. ఈ సందర్బంగా తనకు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డితో అనుబంధం కలిగి ఉన్నానని పేర్కొన్నారు. తక్షణమే తాను జస్టిస్ రెడ్డికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియ చేసినట్లు స్పష్టం చేశారు ఎంఐఎం ఎంపీ.
Also Read : IND vs PAK Asia Cup Sensational : దాయాదుల పోరుపై ఎడతెగని ఉత్కంఠ















