అమెరికా : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్ విద్యా సీఈఓ జెన్సెన్ హువాంగ్. దీనిని తోసి పుచ్చారు తను. ఏఐ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందనే ఆందోళనలను ఆయన పూర్తి అర్థరహితం అని కొట్టి పారేశారు. ఏఐ భద్రత అనేది పూర్తిగా ఒక ఇంజనీరింగ్ సమస్య అని ఆయన వాదించారు. ఇటీవల, కృత్రిమ మేధస్సు ఉద్యోగాలను నాశనం చేయవచ్చనే వాదనను జెన్సెన్ హువాంగ్ తిరస్కరించారు ఆ ఆలోచనను పక్కన పెట్టాలని పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని కొనసాగించాలని ఆయన సమర్థిస్తున్నారు, తద్వారా ఈ సాంకేతికతను నియంత్రించడానికి కొత్త నిబంధనలు అవసరం లేదని సూచిస్తున్నారు. ఏఐ మోడల్ సామర్థ్యాల వేగాన్ని తగ్గించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఐ సాంకేతికత వేగవంతమైన అభివృద్ధిపై విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐ ఉద్యోగాలను సృష్టిస్తుందనేది రెండవ ఆలోచన. అది కూడా పూర్తిగా అర్థరహితమే అని కాలిఫోర్నియాలో సేల్స్ ఫోర్స్ సీఈఓ , చైర్మన్ మార్క్ బెనియోఫ్ నిర్వహించిన కార్యక్రమంలో హువాంగ్ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌తో మీరు దేనినైనా కనుగొనవచ్చు. ఇప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా ఒక మౌలిక సదుపాయాల వ్యవస్థగా ఏఐ అందుబాటులోకి రావడంతో మనం ప్రతి విషయాన్ని తెలుసు కోవచ్చు , ఏదైనా చేయవచ్చని అన్నారు. భద్రత అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసేటప్పుడు భద్రత విషయంలో రాజీ పడకూడదని ఎన్ వ్విద్యా నొక్కిచెప్పినప్పటికీ, అది ఒక ఇంజనీరింగ్ సమస్య అని ఆయన వాదించారు. కంపెనీలు తమకు పూర్తి నమ్మకం కలిగే వరకు ఏఐ అభివృద్ధిని కొనసాగించాలని హువాంగ్ స్పష్టం చేశారు.

















