హైదరాబాద్ : ప్రపంచాన్నిటెక్నాలజీ పరంగా పూర్తిగా డామినేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్. అన్ని రంగాలను ప్రభావితం చేయగలదేమో కానీ న్యాయ వ్యవస్థను రీప్లేస్ చేయలేదన్నారు. న్యాయవాదుల మనస్సులను లేదా న్యాయమూర్తుల నీతిని ఏఐ భర్తీ చేసే సీన్ లేదన్నారు. అయితే టెక్నాలజీ నోట్‌ను రూపొందించడంలో సహాయ పడవచ్చు, కానీ దానిని చట్టాన్ని కనిపెట్టడానికి ఉపయోగ పడదన్నారు జస్టిస్ . అయితే అదే సమయంలో ఏఐ దుర్వినియోగం న్యాయ వ్యవస్థను దానితో నిమగ్నం కావడానికి పూర్తిగా నిరాకరించే వ్యతిరేక తీవ్రతకు దారి తీయదని అభిప్రాయపడ్డారు.
తెలివిగా ఉపయోగించి నట్లయితే ఏఐ సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. చట్ట పరమైన పనికి సంబంధించి కొన్ని అంశాలను మరింత నిర్వహించేలా చేస్తుందన్నారు జస్టిస్ విక్రమ్ నాథ్. కానీ అది న్యాయవాది శిక్షణ పొందిన మనస్సును, కోర్టు న్యాయమూర్తి నైతిక బాధ్యతను లేదా న్యాయమూర్తికి అవసరమైన క్రమశిక్షణా తీర్పును భర్తీ చేయదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో కూడా ఏఐ ఉత్పత్తి చేయబడిన విషయాలను నిర్లక్ష్యంగా ఉపయోగించిన సందర్భాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చట్టపరమైన సమర్పణల సమగ్రతను, తీర్పు ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాధానం ఇవ్వడం, సమాచార వినియోగం, నైతిక క్రమశిక్షణ, వృత్తి పరమైన ప్రమాణాలు ముఖ్యమన్నారు. ఈ సాధనాలను సమర్థవంతంగా, జాగ్రత్తగా ,వాటి పరిమితుల గురించి పూర్తి అవగాహనతో ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోవాలని హితవు పలికారు జస్టిస్ విక్రమ్ నాథ్.



















