AFG vs HK : దుబాయ్ : ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ 2025 దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. హాట్ ఫెవరేట్ గా ఉన్న భారత్, ఆఫ్గనిస్తాన్ జట్లు కీలకంగా మారాయి. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ (Afghanistan) బోణీ కొట్టింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 94 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది. ఇవాళ కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. భారత జట్టు ఆడనుంది. జట్టుకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు సంజూ శాంసన్ ఆడేది ఇంకా తేలలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య టి20 మ్యాచ్ జరిగింది. సెదికుల్లా అటల్ , అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతమైన అర్ధశతకాలు సాధించారు.
AFG vs HK Asia Cup Updates
అటల్ 52 బంతులు ఎదుర్కొని 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒమర్జాయ్ సూపర్ షో చేశాడు. తను కేవలం 21 బాల్స్ లలోనే 53 రన్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ను ఆఫ్గనిస్తాన్ బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 94 రన్స్ కే పరిమితం చేశారు. ఫరూఖీ కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే నయీబ్ 8 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమైంది.
కాగా ప్లే దశలోనే హాంకాంగ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. కేవలం 23 రన్స్ చేసింది. నిజకత్ ఖాన్ ,కల్హాన్ చల్లూ అనవసరంగా రనౌట్ అయ్యారు.
Also Read : France President Shocking Decision : ఫ్రాన్స్ ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను

















