Aditya Thackeray : ముంబై : శివసేన బాల్ ఠాక్రే అగ్ర నాయకుడు ఆదిత్యా ఠాక్రే (Aditya Thackeray) సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రాస్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో బీఎంసీ ఎన్నికల కోసం సంబంధించి తయారు చేసిన ఓటర్ల లిస్టుపై మండిపడ్డారు. ఇది పూర్తిగా కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందేందుకు మాత్రమే తయారు చేసినట్లుగా ఉందంటూ ఫైర్ అయ్యారు. ఒక రకంగా ఓట్ చోరీ చోటు చేసుకుందన్నారు. ఆదివారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈనెల 7వ తేదీన విడుదల చేయాల్సిన ఓట్ జాబితాను ఇవాళ రిలీజ్ చేశారని అన్నారు.
Aditya Thackeray Shocking Comments
డ్రాఫ్ట్ రోల్ మెషిన్ చదవగలిగేది కాదని , ప్రత్యేకించ పేరును కనుగొనడానికి దాదాపు 45,000 మంది ఓటర్లను స్క్రోల్ చేయాల్సిన ఫార్మాట్‌లో ఉందన్నారు. ఓటర్ల జాబితాలను విభజించారని, వ్యూహాత్మకంగా, జనాభా పరంగా , ఓటు బేస్ వారీగా, బిజెపి బలహీనంగా ఉన్న మునిసిపల్ వార్డులకు జోడించడానికి మార్చారని ఆరోపించారు ఆదిత్యా ఠాక్రే. కొన్ని చోట్ల, ఓటరు జాబితాను ఒక భవనం నుండి కూడా పాక్షికంగా విచ్ఛిన్నం చేశారని వాపోయారు. ఇది ఓటు చోరీ తప్ప మరొకటి కాదన్నారు .ఈసీ అసమర్థత తెలిసి పోయిందన్నారు. వెంటనే వారిని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగితే, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, ఓటర్లు వారి రాజ్యాంగ హక్కును వినియోగించు కోకుండా నిరోధించినందుకు ఈసీపై అభియోగం మోపాల్సి ఉంటుందన్నారు ఆదిత్యా ఠాక్రే.
Also Read : CM Chandrababu Interesting Comments on Saibaba : మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

















