Adani Group : విశాఖపట్నం : అదానీ గ్రూప్ సంచలన ప్రకటన చేసింది. భారీ ఎత్తున ఇన్వెస్ట్ ప్రకటించింది. ఏపీ సర్కార్ కు తీపి కబురు చెప్పింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అదానీ సంస్థ (Adani Group) కార్యకలాపాలు ఇప్పటికే లక్షకు పైగా ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయని, రాబోయే ప్రాజెక్టుల ద్వారా మరిన్ని పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ప్రణాళికలు ఉన్నాయని అదానీ గ్రూప్ సీఈవో కరణ్ అదానీ స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెడుతుందని తెలిపారు.
Adani Group Huge Investments in AP
ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ఈ పెట్టుబడి పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధనం, అధునాతన తయారీలో విస్తరించి ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఇప్పటికే పెట్టుబడి పెట్టిన రూ. 40,000 కోట్ల కంటే ఎక్కువ అని తెలిపారు. బిలియనీర్ గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు అదానీ గూగుల్‌తో భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్-పవర్డ్ హైపర్‌స్కేల్ డేటా-సెంటర్ ఎకోసిస్టమ్‌లలో ఒకదాన్ని నిర్మించడం కూడా కీలకంగా మారిందన్నారు. 15 బిలియన్ల వైజాగ్ టెక్ పార్క్ విజన్‌ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరికొన్ని నిధులను కూడా దశల వారీగా పెడతామని పేర్కొన్నారు గౌతమ్ అదానీ.
Also Read : CM Chandrababu Important Update : మరో మూడు ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు



















