Actress Tulasi : హైదరాబాద్ : ప్రముఖ నటి తులసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తాను ఇక నుంచి నటించడం లేదని తెలిపారు. జీవితంలో అన్నింటిని అనుభవించానని, కావాల్సినంత గుర్తింపు వచ్చిందన్నారు. ఇదే సమయంలో తనను ఆదరించిన అభిమానులకు, సహకరించిన పెద్దలు, సినీ రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు తులసి (Actress Tulasi). తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, కష్టాలు తనను చుట్టు ముట్టిన క్రమంలో తనకు అండగా ఉన్నది, భరోసా కల్పించింది మాత్రం షిర్డీలోని సాయి బాబానేనని తెలిపింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Actress Tulasi Leaving Movies
ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300కు పైగా సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించారు. వేలాది మంది అభిమానుల మనసు దోచుకున్నారు. ఇప్పుడు తన మనసు, శరీరం సినిమాలలో నటించాలని అనుకోవడం లేదని తెలిపింది. అందుకే సాయి బాబా సన్నిధిలోనే జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది తులసి.
Also Read : K Kavitha Huge Support Saudi Bus Victims : మక్కా బస్సు బాధిత కుటుంబాలకు కవిత భరోసా



















