Subhalekha Sudhakar : హైదరాబాద్ : గాన గంధర్వుడు, దివంగత గాయకుడు శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం (ఎస్పీబీ) స్మత్యర్థం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డిసెంబర్ 15వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు ప్రముఖ నటుడు, ఎస్పీబీ సోదరి , గాయని ఎస్పీ శైలజ భర్త శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar). ఇదిలా ఉండగా ఎస్పీబీ విగ్రహం ఏర్పాటుకు సీఎం అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నిర్వాహకులు.
Subhalekha Sudhakar Invites CM Revanth Reddy
ఎస్పీబీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి డిసెంబర్ 15న జరిగే విగ్రహావిష్కరణకు తప్పకుండా రావాలని విన్నవించారు. శుభలేఖ సుధాకర్ కోరగా వెంటనే ఓకే చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మహా గాయకుడని, ఎస్పీబీ అంటే ఎవరికైనా అభిమానం తప్పక ఉంటుందన్నారు. తెలుగు వారి గొంతుకగా ప్రపంచానికి తన ప్రతిభా నైపుణ్యంతో దేశానికి గర్వ కారణంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ఎప్పటికీ ఎస్పీబీ అందరి హృదయాలలో కొలువుతీరి ఉంటారని అన్నారు. ఈ లోకంలో పాట ఉన్నంత వరకు శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం బతికే ఉంటారని, ఆయన విగ్రహావిష్కరణకు హాజరు కావడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు సీఎం.
Also Read : MP Nasir Hussain Shocking Comments : కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ కు ఢోకా లేదు : ఎంపీ
















