రేప‌టితో స‌ల్మాన్ ఖాన్ కు 60 ఏళ్లు

కొన‌సాగుతున్న సినీ ప్ర‌స్థానం

hellotelugu-SalmanKhan

ముంబై : బాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టుడు స‌ల్మాన్ ఖాన్. త‌ను ఇప్ప‌టి దాకా పెళ్లి చేసుకోలేదు. న‌టి ఐశ్వ‌ర్య‌తో ప్రేమాయ‌ణం న‌డించింది. కానీ త‌ను ఓవరాక్ష‌న్ కార‌ణంగా ఒప్పుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను ఒంట‌రిగానే ఉన్నాడు. ఇంకా సినిమాలు చేస్తూనే వ‌స్తున్నాడు. డిసెంబ‌ర్ 27వ తేదీ శ‌నివారం నాటికి త‌న‌కు 60 ఏళ్లు పూర్త‌వుతాయి. ఈ సంద‌ర్బంగా సల్మాన్ ఖాన్ ప్రయాణం భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది. దాదాపు 30 ఏళ్ల‌వుతోంది త‌ను సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చింది. 100కి పైగా సినిమాల‌లో న‌టించాడు స‌ల్మాన్ ఖాన్. లెక్క‌లేనంత మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు త‌న న‌టన‌తో.

ఇక‌ హిందీ సినిమాలోని అత్యంత నమ్మకమైన తారలలో ఒకరిగా తనను తాను నిరూపించుకున్నారు, నిలకడగా బాక్సాఫీస్ విజయాలను అందిస్తున్నారు. హృద్యమైన ప్రేమ కథా చిత్రాలు , కుటుంబ వినోదాత్మక చిత్రాల నుండి ఉత్కంఠభరితమైన యాక్షన్ చిత్రాలు , సామాజిక సందేశం ఉన్న చిత్రాల వరకు వ‌చ్చిన ప్ర‌తి ఛాన్స్ ను ఉప‌యోగించుకున్నాడు ఖాన్. త‌న సినీ ప్ర‌స్థానం “బీవీ హో తో ఐసీ” (1988) చిత్రంలో సహాయ పాత్రతో మొద‌లైంది. 1989లో వ‌చ్చిన మైనే ప్యార్ కియా మూవీ ఖాన్ కు ఎన‌లేని పేరు తీసుకు వ‌చ్చింది. ఇందులో ఎస్పీబీ పాడిన పాట‌లు త‌న‌కు అస్సెట్ అయ్యాయి. రాత్రికి రాత్రే స్టార్ డ‌మ్ సంపాదించి పెట్టింది ఈ చిత్రం. ఉత్త‌మ న‌టుడి అవార్డు కూడా ద‌క్కింది. 1990లో బాఘీ, స‌న‌మ్ బేవ‌ఫా, సాజ‌న్ , హ‌మ్ ఆప్కే హై కౌన్ , అందాజ్ అప్నా అప్నా, క‌ర‌ణ్ అర్జున్ , జుడ్వా, బీవీ నెంబ‌ర్ 1, హ‌మ్ సాథ్ సాథ్ హై చిత్రాలు త‌న‌ను న‌టుడిగా నిలబెట్టాయి. పేరు తెచ్చేలా చేశాయి.

2000వ ద‌శ‌కంలో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన తేరే నామ‌, బాగ్ న్, ముజ్ సే షాదీ క‌రోగీ, నో ఎంట్రీ, పార్ట‌న‌ర్ , వాంటెడ్ , మై ఔర్ మిసెస్ ఖ‌న్నా చిత్రాలు ఆద‌ర‌ణ పొందాయి. 2010లో వ‌చ్చిన ద‌బాంగ్ దుమ్ము రేపింది. ఏక్ థా టైగ‌ర్ , కిక్ , బ‌జ‌రంగీ భాయిజాన్ , సుల్తాన్ , టైగ‌ర్ జిందా హై , భార‌త్, దబాంగ్ -3 మూవీస్ బాక్సాఫీస్ లు బ‌ద్ద‌లు కొట్టాయి. 2021లో వ‌చ్చిన రాధే, అంతిమ్ , 2023లో వ‌చ్చి కిసీ కా భాయ్ కిసీకీ కి జాన్ , 2025లో వ‌చ్చిన సికంద‌ర్ ఉన్నాయి. ఖాన్ ఇంకా చెక్కు చెద‌ర‌కుండా అలాగే ఉన్నాడు.

https://www.youtube.com/watch?v=w2iozAbNXAo

Exit mobile version