చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దివంగత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి. తనపై బయో పిక్ తీస్తున్నారు. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు నటి రష్మిక మందన్నా. ఈ బయోపిక్కు ముందు ఎం.ఎస్. సుబ్బులక్ష్మిని ఆధ్యాత్మిక చిహ్నంగా అభివర్ణించారు తలైవా రజనీకాంత్. ఇదిలా ఉండగా సూపర్‌స్టార్ ఇచ్చిన ప్రోత్సాహానికి, ఆశీర్వాదాలకు చిత్ర నిర్మాతలు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దిగ్గజ కర్ణాటక గాయని, భారతరత్న పురస్కార గ్రహీత ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ బృందానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ‘జైలర్ 2 సూపర్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన చూపిన ఉత్సాహ భరితమైన స్పందన చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగించింది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని వ్యక్తం చేశారు. రజనీకాంత్ ఆమెను పాన్-ఇండియా ఆకర్షణ కలిగిన ఒక దైవిక ఆధ్యాత్మిక చిహ్నంగా అభివర్ణించారు. ‘ఎంఎస్: ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే పేరుతో రాబోతున్న బయోపిక్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించే సహకారం ఆ దిగ్గజ గాయనికి తగిన నివాళి అవుతుందని తాను భావిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఎం.ఎస్.ఎస్. బయోపిక్ అనిరుధ్ చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇది మరో శంకరాభరణం కాబోతోంది. దాని కోసం నేను వేచి చూస్తున్నానని చెప్పారు. భారతదేశపు గొప్ప సంగీత దిగ్గజాలలో ఒకరి స్ఫూర్తి దాయకమైన జీవిత కథను వెండి తెరపైకి తీసుకు రావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా, ఈ చిత్ర పూజా కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది.
ఇక ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ , బన్నీ వాస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు మద్దతు ఇస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బయోపిక్‌లో అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలు ఉంటాయని భావిస్తున్నారు.



















