Popular Actor Kota Srinivasa Rao : ప్ర‌ముఖ న‌టుడు కోట శ్రీ‌నివాసరావు క‌న్నుమూత

750కి పైగా సినిమాలలో న‌టించిన విల‌క్ష‌ణ న‌టుడు

Hello Telugu - Popular Actor Kota Srinivasa Rao

Hello Telugu - Popular Actor Kota Srinivasa Rao

Kota Srinivasa Rao : ప్ర‌ముఖ న‌టుడు కోట శ్రీ‌నివాస రావు క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతూ ఆదివారం తెల్లవారుజామున హైద‌రాబాద్ లోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. విల‌న్ గా, క‌మెడియ‌న్ గా భిన్న‌మైన పాత్ర‌లు పోషించారు. విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు. త‌న వ‌య‌సు 83 ఏళ్లు. సినీ కెరీర్ ప‌రంగా కోట శ్రీ‌నివాస రావు (Kota Srinivasa Rao) 750కి పైగా సినిమాల‌లో న‌టించారు. ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు పొందారు.

Kota Srinivasa Rao No More

కోట శ్రీ‌నివాస‌రావు స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడు. 1978లో ప్రాణం ఖ‌రీదు సినిమాతో సినీ రంగంలోకి ప్ర‌వేశించారు. రాజ‌కీయ ప‌రంగా భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉన్నారు. 1999-2004 మ‌ధ్య కాలంలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత దూరంగా ఉన్నారు.

త‌ను జూలై 10, 1942లో పుట్టాడు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్ర‌శంస‌లు పొందాడు కోట శ్రీ‌నివాస రావు. ఆయ‌న తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టించారు. విల‌న్ , క్యారెక్ట‌ర్, స‌హాయ న‌టుడి పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించాడు. 2012లో కృష్ణం వందే జ‌గ‌ద్గురుం చిత్రంలో అద్భుతంగా న‌టించినందుకు సిమా అవార్డు అందుకున్నాడు. భార‌తీయ సినిమా రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా భార‌తదేశ‌పు నాల్గ‌వ అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ‌ని అందుకున్నారు.

కోట శ్రీ‌నివాస రావు న‌టించిన సినిమాల‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన సినిమాలు చాలా ఉన్నాయి. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అత్తారింటికి దారేది, ర‌క్త చ‌రిత్ర‌, లీడ‌ర్, రెడీ, పెళ్లైన కొత్త‌లో, స‌ర్కార్, బొమ్మ‌రిల్లు, ఆ న‌లుగురు, మ‌ళ్లీశ్వ‌రి, ఇడియ‌ట్, పృథ్వీ నారాయ‌ణ‌, చిన్నా, గ‌ణేష్, అన‌గ‌న‌గా ఒక రోజు, లిటిల్ సోల్జ‌ర్స్, ఆమె, హ‌లో, గోవిందా గోవిందా, గాయం, మ‌నీ, శ‌త్రువు, శివ‌, ఆహా నా పెళ్లంట‌, ప్ర‌తి ఘ‌ట‌న‌, రేప‌టి పౌరులు, త‌మిళ సినిమా సామి మూవీలో విల‌న్ గా గుర్తింపు పొందాడు.

Also Read : Popular Actor Prakash Raj : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందీ జ‌పం ప్ర‌కాశ్ రాజ్ ఆగ్ర‌హం

Exit mobile version