మహారాష్ట్ర : మరాఠాలో అత్యంత పేరు పొందిన షిర్డీలోని సాయిబాబా క్షేత్రాన్ని గురువారం దర్శించుకున్నారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబీకులతో. నూతన సంవత్సరం సందర్బంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు నటుడికి సాదర స్వాగతం పలికారు. బిగ్ బాస్ -9 రియాల్టీ షో పూర్తయింది. ఈ షోకు తను హోస్ట్ గా నిర్వహించారు. గతంలో నటుడిగా పేరు పొందారు. షిర్డీ సాయిబాబా ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా నాగార్జున గతంలో 2012వ సంవత్సరంలో షిర్డీ సాయి పేరుతో తీసిన సినిమాలో సాయిబాబాగా నటించారు. ఈ సందర్శన తర్వాత తాను నిజంగా ధన్యుడినని భావించానని అన్నారు స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
తనకు స్వామి వారంటే ముందు నుంచి భక్తి అని తెలిపారు. ఈ నూతన సంవత్సరాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు అక్కినేని నాగార్జున. కెరీర్ పరంగా తన చారిత్రాత్మక 100వ సినిమా కోసం దైవాశీస్సులు కోసం షిర్డీకి వచ్చానని చెప్పారు. ప్రతి ఏటా తాను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోందని స్పష్టం చేశారు ప్రముఖ నటుడు. చాలా కాలంగా సాయిబాబా నన్ను పిలుస్తున్నారని నాకు అనిపించింది. కానీ ఆయన దర్శనం చేసుకునే అవకాశం ఈ రోజు లభించింది అని అన్నారు. ఈ నటుడు 2026లో తన 100వ చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ వందో చిత్రానికి లాటరీ కింగ్ అని పేరు పెట్టారు దర్శకుడు.



















