Rahul Ramakrishna : హైదరాబాద్ : ఎక్స్ వేదికగా తాను చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపడం, చర్చనీయాంశంగా మారడంతో శనివారం స్పందించారు నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). ఈ మేరకు శనివారం తన ఎక్స్ ఖాతాను రీ ఓపెన్ చేశాడు. కొందరు తనను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడం పట్ల తీవ్రంగా స్పందించాడు. తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి, పరిపాలన గురించి తనకు ఏం తెలుసంటూ ప్రశ్నించారు. తాను అందరి లాంటి గొప్ప నటుడిని కాదన్నారు. కేవలం ఒక చిన్నపాటి నటుడిని మాత్రమేనని పేర్కొన్నారు రాహుల్ రామకృష్ణ.
Rahul Ramakrishna Response
అనుభవజ్ఞులైన నాయకులతో తాను ట్వీట్స్ చేసిన అనంతరం సంభాషించానని, తాను వ్యక్తం చేసిన ఆందోళన తప్పుగా ఉందని తాను గ్రహించానని పేర్కొన్నారు. వ్యవస్థను ఎవరు నడిపినా, ఎలా నడిపినా దేశానికి, ప్రజలకు మంచి జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు నటుడు రాహుల్ రామకృష్ణ. ఇదిలా ఉండగా తను కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ పై. ఈ సందర్బంగా స్పందిస్తూ మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు నటుడు. అంతే కాదు నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగి పోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
కాగా ఈ పోస్టులు పెట్టిన కొన్ని గంటల్లోనే రాహుల్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం విశేషం. అయితే, రాహుల్ రామకృష్ణ ఎందుకు ఎలాంటి పోస్టులు పెట్టాడు? తరువాత తన ఎక్స్ అకౌంట్ ను ఎందుకు తిరిగి ఓపెన్ చేశాడనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : IND vs WI India Victory : విండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

















