టీడీపీలో ప్ర‌క్షాళ‌న..విధేయులు, క‌ష్ట‌ప‌డిన వారికే పెద్ద‌పీట

త‌న‌దైన మార్క్ చూపించిన పార్టీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-TDPhighCommand

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప‌లు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. మ‌రోసారి కీల‌క‌మైన పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు త‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ కు ద‌క్కింది. ఈసారి గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును కొత్త పుంతలు తొక్కించారు పార్టీ బాస్, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గత కొంత కాలంగా చెబుతున్నట్టే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంద‌రికీ షాక్ ఇచ్చారు.

పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్. రాష్ట్ర కమిటీలోని 185 మందిలో 50 మంది మహిళలకు చోటు క‌ల్పించారు పార్టీ బాస్. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం క‌ల్పించ‌డం విశేషం. జనాభా దామాషా పద్దతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేప‌ట్టారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించింది పార్టీ హైక‌మాండ్. బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు ద‌క్కింది. బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాంత చొప్పున కమిటీలో స్థానం కల్పించారు.

Exit mobile version