అమరావతి : రాష్ట్రంలో పట్టణ పురపాలికలు, కార్పొరేషన్లకు సంబంధించి దుకాణాలు, ఇతర సముదాయాల అద్లెల వసూలుకు సంబంధించి కొత్త విధానం తీసుకు రావాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, రైతు బజార్లు, హోటళ్లు వంటివి రాజధానికి ఏకకాలంలో రావాలన్నారు. రాజధాని అమరావతి రహదారులను విజయవాడ, మంగళగిరి, తాడేపల్లితో త్వరితగతిన కనెక్ట్ చేయాలన్నారు. సమీక్షలో టౌన్, కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్ రూపొందించిన ప్రజాహిత ప్రణాళిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు.
మున్సిపల్ షాపు అద్దెలు… ప్రస్తుతం 3 ఏళ్లకు ఒకేసారి 33 శాతం పెంచడానికి బదులుగా ప్రతీ ఏటా తక్కువ శాతం మాత్రమే పెరిగేలా కొత్త విధానం తీసుకు రావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.15,893 కోట్ల విలువైన మొత్తం 622 మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2024 నుంచి ఇప్పటివరకు పట్టణాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తకు గాను 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని జూన్ కల్లా పూర్తి స్థాయిలో తొలగింపు జరుగుతుందన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో విలీనమైన గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అధికారుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు.


















