చెన్నై : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. అది ఎండ వేడిమి కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. గతంలో కంటే ఈసారి తమకు ఎక్కువగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్. ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు మద్దతుగా సేలం నగరంలో ఒక భారీ మహిళా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎంతో కలిసి పాల్గొన్నారు ఎంపీ , ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఆయనతో పాటు జాతీయ ప్రగతిశీల ద్రవిడ కజగం ప్రధాన కార్యదర్శి, వృద్ధాచలం శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి ప్రేమలత కూడా హాజరయ్యారు.
ద్రవిడ ఆదర్శ ప్రభుత్వం భారతదేశంలో మరెక్కడా లేని విధంగా మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేసిందని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. ఆయన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ విజయాలను ప్రశంసిస్తూ వేలాది మంది మహిళలు నిర్వహించిన ఈ చారిత్రాత్మక ర్యాలీలో వారితో కలిసి పాల్గొనడం నాకు ఒక భావోద్వేగ క్షణంగా మిగిలి పోతుంందన్నారు .2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ఘన విజయాన్ని అందించే ఈ గొప్ప కార్యక్రమంలో, నేను స్వరపరిచిన ‘తలైవన్ ఇరుక్క్రిన్నన్’ పాట ప్రసారం కావడం నాకు సంతోషంగా ఉందన్నారు కమల్ హాసన్. ఈ స్ఫూర్తిదాయకమైన పాట త్వరలోనే మీ చెవులకు చేరుతుందని ప్రకటించారు.















