Trump : అమెరికా – సుంకాల విధింపులతో ప్రపంచంలోని పలు దేశాలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ వస్తున్న అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ కాబోతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ అధికారికంగా వైట్ హౌస్ సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఆగస్టు 15న అమెరికా లోని అలస్కాలో ప్రత్యేకంగా ఈ ఇద్దరు దేశాధినేతలు సమావేశం కానున్నారని, ఇందులో ప్రధాన అంశాలు చర్చిస్తారని తెలిపారు. ప్రత్యేకించి రష్యా ఉక్రెయిన్ పై దాడులను ఆపాలని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు ట్రంప్. ఈ విషయాన్ని తను కూడా ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియ చేస్తానంటూ పేర్కొన్నారు.
Trump Meet Putin
రాబోయే శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి పుతిన్, ట్రంప్ ఎంపికలపై దృష్టి పెడతారని రష్యా అధ్యక్ష సహాయకుడు యూరీ ఉషాకోవ్ ధృవీకరించారు కూడా. కాగా పుతిన్‌తో కలవడానికి రష్యన్, ఉక్రెయిన్ నాయకుల మధ్య సమావేశం తనకు షరతు కాదని ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే అలాస్కా శిఖరాగ్ర సమావేశం తర్వాత, పుతిన్, ట్రంప్ మధ్య తదుపరి సమావేశం రష్యాలో జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు యూరీ ఉషా కోవ్ . ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తో పుతిన్ మూడు గంటల పాటు జరిగిన సమావేశం తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖి సమావేశం కోసం ప్రణాళికలు మొదట వెలువడ్డాయి. ఇందులో ఇండియాపై టారిఫ్ స్ గురించి చర్చకు రానుంది.
Also Read : Uyi Amma Song Sensational : ఊపేస్తున్న ఉయ్ అమ్మా సాంగ్

















