APWUJ : అమరావతి – రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త ఆక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు అవసరం అయిన జి ఓ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపటం అభినందనీయమని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) తెలిపింది. ఆమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జయరాజు , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి డి సోమసుందర్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శివ ఏచూరి, చిన్న మధ్య తరహా పత్రికల అసోసియేషన్ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
APWUJ Journalists Cards
కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణదల తో పాటు మంత్రులు, అధికారులను కలవడం జరిగిందన్నారు. అంతే కాకుండా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల నిరసన కు పిలుపు నివ్వగా జర్నలిస్ట్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తెలియజేయడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు కొత్త ఆక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ను రద్దు చేయడం, జర్నలిస్టులందరికీ ఆక్రిడిటేషన్లు వచ్చేలా నిబంధనలు సడలించడం నిజంగా అభినందనీయం అన్నారు.
ఏపీయూడబ్ల్యూజే తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు. అలాగే ఆక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం కూడా ఆహ్వానించ దగిన పరిణామమని పేర్కొన్నారు. ఐ అండ్ పీఆర్ అధికారులు వెంటనే స్పందించి రాష్ట్ర, జిల్లా లో అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అక్రిడేషన్ మళ్లీ రెన్యువల్ చేయకుండా నెలలోపు కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని సూచించారు.
Also Read : CM Devendra Fadnavis Alarming : బీసీలు పాలకులుగా ఎదగాలి – సీఎంలు


















