Minister Ramanaidu : కృష్ణా జిల్లా – రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసిన అన్ని పంటలకు సమృద్దిగా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Ramanaidu). కృష్ణా జిల్లా పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు . కృష్ణా డెల్టా ఈస్టర్న్ కెనాల్ కింద ఉన్న గుడివాడ, పెడన కైకలూరు నియోజకవర్గల్లో సాగు నీటి సమస్యలపై ప్రత్యక్షంగా పరివీలించారు.ఈస్టర్న్ కెనాల్ కు 10,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా, దిగువకు సాగు నీరు అందని పరిస్థితి నెలకొందని గుర్తించారు. దీనిపై ఆరా తీశారు. రైతులకు చివరి ఆయకట్టు దాకా నీరందించాలలని ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు నిమ్మల రామా నాయుడు.
Minister Ramanaidu Key Commenys –
సిఈ దగ్గర నుండి కింద స్థాయి ఉద్యోగులు అందరూ కెనాల్స్ పై తిరుగుతూ సాగు నీరు పర్యవేక్షించాలని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఒక ఏడాది వరదలు వస్తే, రెండు, మూడు సంవత్సరాలకు సరిపడేలా వాటర్ మేనేజ్మెంట్ ద్వారా నీటి నిల్వలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారన్నారు నిమ్మల రామానాయుడు (Minister Ramanaidu). ఆనాడు రూ.1350 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, పట్టిసీమ కాదు వొట్టి సీమ అని జగన్ విమర్శించాడని మండిపడ్డారు. గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి రూ. 50 వేల కోట్ల ఆదాయం సృష్టించామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన సాగునీటి సంఘాలకు చంద్రబాబు పునరుజ్జీవం పోయడం తో ఇరిగేషన్ వ్యవస్థ బాగు పడిందన్నారు. గత 5 ఏళ్ళు కాలువల్లో పూడిక తీత, డీ సిల్టింగ్ పనులు చేయ లేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం 100 కోట్లు కూడా కేటాయించక పొతే, కూటమి ప్రభుత్వం మొదటి ఎడాదే 700 కోట్లతో కాలువలు పూడిక పనులు చేశామన్నారు నిమ్మల రామానాయుడు. శ్రీశైలం ప్లంజ్ పూల్ ప్రమాదం లో ఉంటే గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతులకు, ధవళేశ్వరం గేట్ల మారమ్మతులకు రూ. 350 కోట్లు కేటాయించామని వెల్లడించారు..
Also Read : Minister Parthasarathy Interesting Update : త్వరలో జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు


















