Minister Parthasarathy : విజయవాడ – ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది జర్నలిస్టులకు. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Minister Parthasarathy) . దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని, మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాలలో పలువురు మంత్రులు కూడా సమస్య లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే జరిగింది . ఈ సందర్భంగా విజయవాడ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్థసారథిని (Minister Parthasarathy) ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరు శివ ,రాష్ట్ర నాయకులు ఏడుకొండలు, పలువురు జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
Minister Parthasarathy Key Updates On Journalist
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తమ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తి సానుకూలతతో ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబుకు అవగాహన ఉందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లను ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం పొడిగిస్తూ వస్తుందని, ఇప్పటికైనా కొత్త అక్రిడేషన్ను మంజూరు చేయాలని మంత్రి పార్థసారధి దృష్టికి యూనియన్ నాయకులు తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, విశ్రాంతి జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ,ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పార్థసారథి. ఒంగోలు లో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి, అద్దంకి లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు, పాలకొల్లు లో మంత్రి రామానాయుడు కు , సచివాలయం లో కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు, రాజమండ్రి లో మంత్రి దుర్గేష్ కు, విజయవాడ లో మంత్రి సత్యకుమార్ కు జర్నలిస్టులు వినతి పత్రాలను సమర్పించారు.
Also Read : Minister Atchannaidu Proven : ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి


















