MLC Kavitha : హైదరాబాద్ – బీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే మోసం ఉందన్నారు . ఆత్మగౌరవం ముఖ్యమని జైలు జీవితం నేర్పించిందన్నారు. జైల్లో స్వయంగా పేదల కష్టాలను, బెయిల్ కోసం డబ్బులు లేక నెలల తరబడి జైల్లో మగ్గుతున్నవారిని చూశానని అన్నారు కవిత. జైలుకు వెళ్లే ముందే బీసీ ఇష్యూని తీసుకున్నానని చెప్పారు. పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. టెక్నికల్ సమస్యల వల్ల విగ్రహ ఏర్పాటు ఆగిందన్నారు.
MLC Kavitha Shocking Comments on Congress
తనపై లేని పోని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముందుగా తానే లేవదీశానని అన్నారు. కానీ తామేదో సాధించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన హిత పాదయాత్ర చేపట్టారు పరిగి నియోజవవర్గం నుంచి . ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకు కల్వకుంట్ల కవిత ఏ పార్టీలో ఉందంటూ ప్రశ్నించారు. ఆమె ఏం మాట్లాడుతుందో, ఎందుకు కామెంట్స్ చేస్తుందో తనకే తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.
తనను చులకన చేస్తూ టీపీసీసీ చీఫ్ కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు.
Also Read : LV Subramanyam Shocking Comments : గంటలో శ్రీవారి దర్శనం అసంభవం – ఎల్వీ















