War 2 : జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ , కియారా అద్వానీ కలిసి నటించిన చిత్రం వార్ -2 రిలీజ్ కాకుండానే రికార్డ్ బ్రేక్ చేస్తోంది. సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ముందస్తు టికెట్ల అమ్మకాలు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నాయి. ఉత్తర అమెరికా మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. ఈ చిత్రం ముందస్తు టిక్కెట్ల అమ్మకాలలో 100,000 ను అధిగమించి, కేవలం ఏడు గంటల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.
Jr NTR War 2 Movie Updates
హాలీవుడ్ స్థాయిలో వార్ -2ను (War 2) తెరకెక్కించాడు దర్శకుడు. భారీ ఎత్తున ఖర్చు చేసింది యశ్ రాజ్ ఫిలింస్. తక్కువ రోజుల్లోనే అత్యధిక టికెట్లు అమ్మకాలు జరిగినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ప్రారంభంలో 11 గంటల 37 నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ సొంత చిత్రం దేవర కలిగి ఉన్న మునుపటి రికార్డును వార్ 2 ఇప్పుడు అధిగమించి అరుదైన రికార్డ్ సృష్టించింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు వార్ -2 మూవీ. ఇందులో తన అందాలను ఆరబోసింది అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు అంతటా హల్ చల్ చేస్తున్నాయి. వార్ -2కు సంబంధించి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. రికార్డ్ స్థాయిలో ప్రీ సేల్స్ , ఆల్ స్టార్ తారాగణంతో తీసిన వార్ -2 కోసం అత్యధికంగా అమ్ముడు పోవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Beauty Rashmika – Kingdom : కింగ్ డమ్ మూవీని చూసిన నేషనల్ క్రష్



















