Minister Ponnam : హైదరాబాద్ – స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉపాధి అవకాశాలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు మంత్రి పొన్నం ప్రభార్ (Minister Ponnam). బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఆగస్ట్ 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి , లోకసభ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ కూటమి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , రాజ్యసభ సభ్యులు ఢిల్లీ వెళ్తున్నామని అన్నారు.
Minister Ponnam Prabhakar Shocking Comments
తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలని కోరారు. బీసీ మేధావులు, కుల సంఘాలు అన్ని పార్టీల నాయకులు ఢిల్లీ వచ్చి బీసీలకు రావాల్సిన కోటా అమలు జరిగేందుకు యుద్దం చేయాలన్నారు పొన్నం ప్రభాకర్. గతంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4, 2024 లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కుటుంబాల వారిగా సర్వే జరిపారన్నారు. అందుకు సంబంధించిన నివేదికను సబ్ కమిటీ ద్వారా పరిశీలన చేశామన్నారు. కేబినెట్ లో ఆమోదం కూడా తెలపడం జరిగిందన్నారు.
మార్చి 17 బిల్లు 3,4 తెలంగాణ శాసన సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం, విద్య ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులు శాసన సభ ఆమోదించి మార్చి 22న గవర్నర్ కి పంపడం జరిగిందన్నారు. న్యాయ సలహాలు తీసుకుని గవర్నర్ రాష్ట్రపతికి పంపించారన్నారు. ఈ రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్.
Also Read : Jajula Srinivas Goud Shocking Comments : బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

















