Kingdom : ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బొమ్మదేవర నాగవంశీ నిర్మించారు భారీ ఖర్చు పెట్టి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దీనిని నిర్మించారు. రాబోయే చిత్రం కింగ్డమ్ (Kingdom) కోసం తాత్కాలిక టిక్కెట్ ధరల పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిందని, ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు నిర్మాత నాగవంశీ.
Hero Vijay Deverakonda Kingdom Movie Price Hike Updates
అధికారిక మెమో ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లు జూలై 31, 2025న సినిమా విడుదలైనప్పటి నుండి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 75 (GSTతో సహా) టిక్కెట్ల ధరలను పెంచు కోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా నిర్మాతలు సమర్పించిన అధికారిక అభ్యర్థనను అనుసరించి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆమోదించింది. ముఖ్యంగా కీలకమైన ప్రారంభ వారంలో, పెరుగుతున్న ఉత్పత్తి, మార్కెటింగ్ ఖర్చులను నిర్మాతలు తిరిగి పొందడంలో సహాయ పడటం ప్రభుత్వ నిర్ణయం లక్ష్యమని పేర్కొంది.
కింగ్డమ్ ఇప్పుడు 2025 తెలుగు విడుదల జాబితాలో చేరింది. ఇప్పటి వరకు HIT 3, రాబిన్‌హుడ్, కన్నప్ప, కుబేరా వంటి సినిమాలు ప్రభుత్వం నుండి పర్మిషన్స్ పొందాయి. తాజాగా భారీగా ధరలు పెంచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరి హర వీరమల్లుకు అనుమతి ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
Also Read : Hero Pawan – Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ చిత్రం ఫ్యాన్స్ సంబురం


















